పెళ్లి పేరుతో గర్భవతిని చేశాడు: యువతి ఆత్మహత్య

Nalgonda District
నల్గొండ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసిన తర్వాత పెళ్లి అనగానే మొహం చాటేయడంతో విసిగి పోయిన ఓ యువతి పోలీసు స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం మండల పరిధిలోని వాడపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన బుల్లి (19), అదే గ్రామానికి చెందిన నాగార్జున ప్రేమించుకున్నారు.

అతడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. యువతి అదే ట్రాక్టర్‌పై కూలికి వెళ్లేది. ఈ క్రమంలో అతనితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించాడు. న్యాయం చేయాలని బుల్లి తల్లిదండ్రులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. అయినా అతడు పెళ్లికి అంగీకరించలేదు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు పారిపోయాడు. దీంతో యువతి తల్లిదండ్రులు గత శుక్రవారం వాడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

యువకుడిని పిలిపించి మాట్లాడాలని పోలీసులు గ్రామ పెద్దలకు సూచించారు. వారు నాగార్జునను హైదరాబాద్ నుంచి పిలిపించి ఆదివారం పోలీస్‌ స్టేషన్‌కు పంపించారు. విషయం తెలుసుకున్న బుల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. బుల్లిని పెళ్లి చేసుకోవాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని పోలీసులు నాగార్జునతో చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి అతడు అంగీకరించలేదు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బుల్లి తన వెంట తెచ్చుకున్న క్రిమి సంహారక మందును పోలీస్‌ స్టేషన్ ఆవరణలోనే తాగింది. అనుకోని పరిణామానికి పోలీసులు హతాశులయ్యారు. వెంటనే ఆమెను 108 వాహనంలో చికిత్సనిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుల్లి మృతికి కారణమైన నాగార్జునపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+