ఫోన్ లాక్కొని.. మాజీ మంత్రి కోడలికి లైంగిక వేధింపులు

West Bengal
కోల్‌కతా: మాజీ మంత్రి కోడలి మొబైల్‌ను అపహరించి, ఆమెను లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిని పశ్చిమ బెంగాల్ గ్రీన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అబ్దుల్ మలేక్‌గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం అబ్దుల్ మలేక్ సదరు మాజీ మంత్రి కోడలిని వేధించాడు. అయితే అతను తన మొబైల్ దొంగిలించి.. తనను వేధింపులకు గురి చేస్తున్న సమయంలో ఆమె ధైర్యంగా అరవడంతో పోలీసులు ఆ కేకలు విని ఆమెను రక్షించి, నిందితుడిని పట్టుకున్నారు.

నిందితుడిని బుద్దనగర్ సౌత్ పోలీసులు అరెస్టు చేసి అతనిని స్థానిక అడిషనల్ జ్యూడిషియల్ కోర్టులో హాజరు పర్చారు. కోర్టు అతనికి సెప్టెంబర్ 7వ తేది వరకు రిమాండు విధించింది. మాజీ మంత్రి కోడలిని వేధించిన ఘటన సాల్ట్ లేక్ పరిసరాల్లోని జిడి బ్లాక్‌ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. తాను రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో.. ఎదురుగా ఓ వ్యక్తి సైకిల్ పైన వచ్చి, హఠాత్తుగా తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడని బాధితురాలు(మాజీ మంత్రి కోడలు) చెప్పింది.

తన ఫోన్‌ను లాక్కున్న నిందితుడిని పట్టుకునేందుకు ఆమె ప్రయత్నించింది. అదే సమయంలో అతను తన సైకిల్‌ను ఆపి ఆమెపై వేధింపులకు దిగాడు. అతను ఆమె శరీరంపై చేయి వేశాడు. అతను శరీరంపై చేయి వేయడంతో భయపడిన ఆమె ఒక్కసారిగా అరిచింది. అతను శరీరాన్ని తడుముతుండటంతో భరించలేక గట్టిగా అరుస్తూ ఏడవటం ప్రారంభించింది. దీంతో అతను తన సైకిల్ పైన అక్కడ నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

అదే సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న ఓ గ్రీన్ పోలీసు ఆమె అరుపులు విని అక్కడకు పరుగెత్తుకు వచ్చాడు. నిందితుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుండటం చూసిన సదరు పోలీసు వెంట పడి అబ్దుల్ మలేక్‌ను పట్టుకున్నాడు. అనంతరం మలేక్‌ను బుద్దనగర్ సౌత్ పోలీసులకు అప్పగించాడు. అనంతరం బాధితురాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు మలేక్.. కూరగాయల వ్యాపారి అని, బాంగోర్ ప్రాంతంలో నివసిస్తారని గుర్తించారు. అతను సాల్ట్ లేక్ ప్రాంతానికి ఎందుకు వచ్చారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా నిర్మానుష్యంగా ఉండే సాల్ట్ లేక్ వద్ద స్నాచింగ్ గ్యాంక్ ఒకటి అక్కడి నుండి వచ్చి వెళ్లే వారి నుండి వస్తువులను దోచుకుంటోంది. ఇతను ఆ గ్యాంగ్‌లో ఒకడు కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బాధితురాలు హెచ్‌బి బ్లాక్‌లో నివసిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+