ప్రధాని దొరికిపోయారు, తప్పు ఒప్పుకున్నారు: నామా

సహజవనరుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతిలోని విషయమని, అలాంటిది కొన్ని రాష్ట్రాలను అడ్డం పెట్టుకుని ఈ కుంభకోణం నుంచి తప్పించుకోవాలని కేంద్రం భావిస్తోందని విమర్శించారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించటంలో ఇటు కేంద్రం, అటు ప్రధాని పూర్తిగా విఫలమయ్యారని, తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గనుల కేటాయింపులో ఎలాంటి నష్టం లేదని ఆర్థిక మంత్రి, కాగ్‌వి కాకిలెక్కలని బొగ్గు శాఖ మంత్రి చెబుతుంటే మొత్తంగా కాగ్ నివేదికనే ప్రధాని తప్పు పట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
రాజ్యాంగ సంస్థ అయిన కాగ్‌ను తప్పు పడుతున్నారంటే, రాజ్యాంగంపైన ప్రధానికి నమ్మకం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. కేంద్రాన్ని తప్పు పడుతున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థల్ని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. రూ. 3.78 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలను బయటపెట్టిన కాగ్‌ను తప్పుపట్టడం సరికాదన్నారు. తక్షణం బొగ్గు కేటాయింపుల్ని రద్దు చేయాలని, తర్వాతే పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులను అంతర్జాతీయ వేలం ద్వారా విక్రయించాలని, అప్పుడు కాగ్ చెప్పిన నష్టం కంటే ఎక్కువ లాభం వస్తుందని తెలిపారు.
బొగ్గు గనుల కుంభకోణంలో బాధ్యుడై కూడా తప్పును ఒప్పుకోని ప్రధాని మన్మోహన్‌సింగ్ కంటే జగన్ అక్రమాస్తుల కేసులో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావే మేలని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. మంత్రి రాజీనామా చేసినప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించి దాన్ని ఆమోదించటమో, తిరస్కరించటమో చేయాల్సిన ముఖ్యమంత్రి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రంలో అసలు రోడ్లు, భవనాల శాఖకు మంత్రి ఉన్నారా? లేరా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఖరి గర్హనీయమని, వెంటనే ఆయన స్పందిచాలని డిమాండ్ చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications