రూ. 35 వేలే ఫీజు చెల్లిస్తాం: పితాని సత్యనారాయణ

బోధనా ఫీజు చెల్లింపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం మంగళవారం సాయంత్రం మంత్రి పితాని మీడియాతో మాట్లాడారు. రూ. 35 వేల ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బోధనా ఫీజు రూ. 35 వేలకు మించితే విద్యార్థులే భరించాలని తేల్చిచెప్పారు. 2012-13 బోధనా ఫీజుకు సంబంధించి పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించామని తెలిపారు.
67 కళాశాలల్లో టాస్క్ఫోర్స్ తనిఖీల తర్వాత ఫీజు తగ్గే అవకాశం ఉందన్నారు. రూ. 35 వేల ఫీజును 578 కళాశాలలు అంగీకరించాయని చెప్పారు. మెరిట్ విద్యార్థుల విషయంలో బోధనా ఫీజు చెల్లింపునకు సంబంధించి సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఫీజు ఎందుకు చెల్లించాలని మంత్రి ప్రశ్నించారు.
మెరిట్ విద్యార్థులకు ఫీజు చెల్లించే విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కటాఫ్ మార్కులు నిర్ణయించి, ఆ మార్కులు దాటిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications