తూర్పులో చిచ్చు: ఎస్పీ త్రివిక్రమ్‌పై ఎఎస్పీ కేసు

East Godavari Map
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తనపై హత్యాయత్నానికి కుట్ర పన్నారంటూ ఏఎస్పీ ఎఎస్పీ నవీన్ కుమార్ నేరుగా ఆరోపించడం సంచలనాన్ని సృష్టించింది. పైగా ఎస్పీ త్రివిక్రమ వర్మపై రంపచోడవరం ఏఎస్పీ డాక్టర్ నవీన్‌కుమార్ మేజిస్ట్రేట్ యు.గోపాలకృష్ణకు ఫిర్యాదు చేయడం పోలీసు శాఖలో సంచలనం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఏఎస్పీ నవీన్‌కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎస్పీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

తూర్పుగోదావరి ఏజెన్సీలో సాగే గంజాయి వ్యాపారానికి ఎస్పీ పూర్తి అండదండలు అందిస్తున్నారని, తన డ్రైవర్ బసవ ద్వారా ప్రతి లోడుకు రూ. 1.40 లక్షలు వసూలు చేస్తూ స్మగ్లర్లకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ అక్రమాలకు అడ్డుగా నిలవడంతో తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. ఇటీవలి కాలంలో మారేడుమిల్లి మండలంలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిస్తే వారి విడుదల కోసం ఎస్పీ తనతో పాటు, దర్యాప్తు అధికారులపై కూడా ఒత్తిడి తెచ్చారని, వారికి బెయిలు మంజూరయ్యేందుకు సహకరించాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు.

నిందితులు విడుదలైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కోర్టుకు విన్నవించుకోవడం తమకు సిగ్గుచేటన్నారు. తాను తీవ్ర అనారోగ్యం పాలై సెలవు కోరితే మెడికల్ బోర్డుకు రిఫర్ చేయడం దారుణమన్నారు. తాను సెలవు ముగించుకుని వచ్చి మర్నాడు శనివారం కాకినాడకు బయల్దేరితే తన వాహనం జగ్గంపేట మండలం మల్లిశాలలో ప్రమాదానికి గురికావడం కూడా ఎస్పీ కుట్రేనని అన్నారు.

తన వాహనం స్టీరింగ్, చక్రాల బోల్టులను తప్పింపజేసి ప్రమాదానికి గురయ్యేలా చేశారని ఆరోపించారు. జిల్లాలోనూ అనేక వ్యవహారాలు ఉన్నాయని, చెప్పుకొంటే సిగ్గుచేటన్నారు. ఎస్పీ వ్యవహారంపై రంపచోడవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. అక్కడ కేసు నమోదు చేయకపోవడంతో ఆయన రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నేరుగా మేజిస్ట్రేట్ గోపాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే, ఏఎస్పీ ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ నిరాకరించారు. నిజాలన్నీ విచారణలోనే తేటతెల్లమవుతాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+