ఎన్నికలకు సిద్ధంకండి, మధ్యంతరం: ఎంపీలతో సోనియా

బిజెపి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, దానిని మనం ప్రతిపక్షాల వైఖరిని ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని సోనియా సమర్థించారు. ఈ వ్యవహారంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో ఆమె చర్చించారు. సభలో బిజెపి అసంబద్దంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చర్చకు అంగీకరించకుండా బిజెపి పార్లమెంటు వ్యవస్థను అపహాస్యం చేసిందని విమర్శించారు.
సభలో అనవసర రాద్దాంతం చేస్తోందని, మన్మోహన్‌కు అండగా నిలవాలని ఎంపీలకు సూచించింది. కాగా కోల్ గేటు పైన రాజ్యసభ, లోకసభలు పలుమార్లు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. సోమవారం సభ ప్రారంభం కాగానే రాజ్యసభ కొన్ని నిమిషాలలోనే వాయిదా పడింది. ఆ తర్వాత అరగంట తర్వాత ప్రారంభమైనప్పటికీ మళ్లీ రెండోసారి వాయిదా పడింది.
రెండు గంటలకు రాజ్యసభ ప్రారంభమైంది. విపక్షాల ఆందోళన కారణంగా సభను చైర్మన్ మంగళవారానికి వాయిదా వేశారు. లోకసభ తీరు కూడా ఇలాగే ఉంది. సభను స్పీకర్ రెండుసార్లు వాయిదా వేసినప్పటికీ ప్రతిపక్షాలు తగ్గక పోవడంతో రెండు గంటలకు ప్రారంభమైన సభను స్పీకర్ ఈ రోజుకు వాయిదా వేశారు.
కాగా మంగళవారం లోకసభ మొదటిసారి వాయిదా పడిన అనంతరం.. సోనియా గాంధీ ఎంపీలతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలని, మధ్యంతర ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications