హరికృష్ణను చంద్రబాబు పట్టించుకోవడం లేదా?

Harikrishna-Chandrababu Naidu
హైదరాబాద్: తన బావ మరిది, పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామం ఆ అనుమానాలకు కారణంగా కనిపిస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన సిపిఐ రైతు సదస్సు సమాచారాన్ని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నాయకుడు నామా నాగేశ్వర రావు హరికృష్ణకు అందించలేదు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులకు అత్యంత ముఖ్యమైనవారు.

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే అయినప్పటికీ చాలా విషయాలు హరికృష్ణకు కూడా చేరవేయడం పార్టీ నాయకులు ప్రాధాన్యమైన అంశంగానే పరిగణిస్తారు. నామా నాగేశ్వరరావు హరికృష్ణకు అందించకపోవడం వెనక చంద్రబాబు ఉన్నారా అనేది ప్రశ్న. అయితే, చంద్రబాబు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల హరికృష్ణకు చెప్పాల్సిన అవసరం లేదని నామా నాగేశ్వర రావు భావించి ఉండవచ్చునని అంటున్నారు.

చంద్రబాబుకు, హరికృష్ణకు మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. హరికృష్ణను పట్టించుకోకపోవడమే మంచిదనే అభిప్రాయానికి చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి, పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నప్పుడు గానీ విమర్శలకు దిగినప్పుడు గానీ పట్టించుకోకుండా మౌనంగా ఉండే వ్యూహాన్ని అనుసరిస్తారు. వారికి క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తూ పోతారు. దానివల్ల విసుగు చెంది వారే బయటకు వెళ్లాల్సిన పరిస్థితిని కల్పిస్తారని అంటారు.

హరికృష్ణ విషయంలో కూడా చంద్రబాబు అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అనే ప్రశ్న ప్రస్తుతం ఉదయిస్తోంది. న్యూఢిల్లీలో సిపిఐ నిర్వహించిన రైతు సదస్సుకు చంద్రబాబు హాజరు కావాల్సి ఉండింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయింది. ఇక్కడి నుంచి కరణం బలరాం బృందాన్ని చంద్రబాబు ఢిల్లీకి పంపించారు. అయితే, కరణం బలరాంను వేదిక మీదికి అహ్వానించకుండా కిందనే కూర్చోబెట్టారు. దీనిపై కూడా హరికృష్ణ నామా నాగేశ్వర రావుపై మండిపడినట్లు సమాచారం. అయితే, చంద్రబాబు వ్యూహంలో ఇదంతా జరిగిందనే ప్రచారాన్ని తెలుగుదేశం వర్గాలు ఖండిస్తున్నాయి. సమాచారం వినిమయంలో జరిగిన లోపాలే అందుకు కారణమని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+