వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పానిష్ మ్యాగ్‌పై మిషెల్లీ టాప్‌లెస్ స్లేవ్ చిత్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Michelle Obama
మాడ్రిడ్: ఓ స్పానిష్ మ్యాగజైన్‌ కవర్‌పై వేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా చిత్రం దుమారం రేపుతోంది. స్పానిష్ మ్యాగజైన్ ఫుయెరా డే సెరీ అనే పత్రిక తాజా సంచికపై మిషెల్లీ టాప్‌లెస్ స్లేవ్ చిత్రాన్ని ప్రచురించింది. 2012 ఆగస్టు సంచికపై మిషెల్లీ ఫొటోషాప్ చేసిన చిత్రాన్ని వేసింది.

స్పానిష్ వార్తాపత్రిక విస్తరణకు సంబంధించిన అనుబంధంపై ఫ్రెంచ్ ఆర్టిస్టు మేరీ గులిహెల్మైన్ బెనోయిస్టు వేసిన ఫిమేల్ స్లేవ్ పెయింటింగ్‌పై మిషెల్లీ ముఖాన్ని సూపర్ ఇంపోజ్ చేశారు. కుడి వక్షోజం కనిపించేలా, అమెరికా జెండాతో కప్పుతూ కుర్చీపై కూర్చున్నట్లు, జెమినా హెడ్ స్కార్ఫ్ ధరించి ఉన్నట్లు చిత్రాన్ని తయారు చేసి, అమెరికా ప్రజల్లో మిషెల్లీ పాపులారిటీని తెలిపే ఫీచర్ ఆర్టికల్‌ కోసం ఈ చిత్రాన్ని ప్రచురించారు.

మిషెల్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎ స్లేవ్, లేడీ ఆఫ్ అమెరికా అనే వాక్యాలను ప్రచురించారు. ప్రసిద్ధ వ్యక్తులను న్యూడ్‌ను విశ్లేషించే సిరీస్‌లో భాగంగా ఈ కవర్‌ను ప్రచురించినట్లు, ప్రిన్సెస్ డయానా, అబ్రహం లింకన్, మిషెల్లీ భర్త బరాక్ ఒబామాను కూడా అదే విధంగా చూపించాలనేది ఉద్దేశమని క్లచ్ మ్యాగజైన్ తెలిపినట్లు డైలీ మెయిల్ రాసింది.

తన కళాత్మక స్వేచ్ఛను సమర్థించుకుంటూ - ఫ్రెంచ్, ఇంగ్లీష్ ఆర్టిస్టు కరినే పెర్చెరోన్ - డేనియల్ - ప్రసిద్ధ వ్యక్తులను విభిన్నంగా చూసే అవకాశం ఇస్తూ ప్రత్యామ్నాయ అనూహ్య వాస్తవాన్ని చూపించాలనేది ఉద్దేశమని అన్నారు.

English summary
Spanish magazine Fuera de Serie has triggered a huge controversy by portraying First Lady of United States Michelle Obama as a black slave on the cover of its latest edition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X