హెల్త్‌పై కన్నా అందం మీదే ఆసక్తి: అమ్మాయిలపై మోడీ

Narendra Modi
న్యూఢిల్లీ: తమ రాష్ట్రం మధ్య తరగతి అమ్మాయిలపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోషకాహార లోపానికి ముఖ్యంగా శాకాహారం, అందంపై ఆసక్తి కారణమని ఆయన అన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ చాలా వరకు శాకాహార ప్రాధాన్యమైన రాష్టమని ఆయన అన్నారు. మధ్యతరగతి ఎక్కువగా ఉన్న రాష్ట్రమని ఆయన చెప్పారు.

మధ్యతరగతికి ఆరోగ్యంపై కన్నా అందంపై ఎక్కువ శ్రద్ధ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది సవాల్ అని ఆయన అన్నారు. పాలు తాగాలని తల్లి చెప్తే కూతురు గొడవకు దిగుతుందని అన్నారు. తాను పాలు తాగనని, పాలు తాగితే లావు అవుతానని కూతురు తల్లితో అంటుందని మోడీ చెప్పారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి తీవ్రమైన చర్యలు అవసరమని ఆయన అన్నారు. ఈ విషయంలో గుజరాత్ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పారు.

గుజరాత్‌లోని గిరిజనుల్లో, గ్రామీణ ప్రజల్లో, మహిళల్లో పోషకాహార విలువలు తక్కువని ఆయన అన్నారు ఆర్థిక ప్రగతిలో, తగినంత విద్యుచ్ఛక్తి సరఫరాలో రాష్ట్రం సాధించిన ఫలితాలను వివరించడానికి ఆయన అవకాశాన్ని వినియోగించుకున్నారు. గత నెలలో దేశంలో విద్యుచ్ఛక్తి స్తంభన ఏర్పడడంపై ఆయన కేంద్రాన్ని తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వం విద్యుచ్ఛక్తి విషయంలో గుజరాత్ నుంచి పాఠాలు తీసుకుని తగిన మార్పులు చేయాలని ఆయన అన్నారు.

సరళీకరణపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సరళీకరణ విధానాలు అమలు కాకపోవడం అసలైన విషాదమని ఆయన అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రజల ఆదరణ చూరగొంటున్నట్లు ఇటీవలి ఎన్డీటీవి సర్వేలో కూడా తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+