టిడిపితో కలిసి పార్లమెంటు ఎదుట ధర్నా: ములాయం

బొగ్గు కుంభకోణంపై పూర్తిగా దర్యాఫ్తు జరపాల్సిన అవసరముందన్నారు. ఈ కుంభకోణంపై చర్చకు అవకాశమివ్వాలని, సభను సాగకుండా చేయడం సరికాదని అన్నారు. సమావేశాలు సరైన రీతిలో జరిగేలా చూడాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఎన్డీయేలోని జెడియు, అకాలీదళ్ తదితర పార్టీలు సైతం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. కాగా ములాయంతో టిడిపి నేత నామా నాగేశ్వర రావు, వామపక్ష నేతలు గురుదాస్ దాస్ గుప్తా, వాసుదేవ్ ఆచార్యలు భేటీ అయ్యారు.
కాగా బొగ్గు కుంభకోణం శుక్రవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. సభలు ప్రారంభం కాగానే విపక్షాలు ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా కోసం పట్టుబట్టాయి. దీంతో లోకసభ స్పీకర్ మీరా కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications