కత్తితో బెదిరించి:3వసారి ఆ కోరిక తీర్చలేదని పొడిచింది

మూడోసారి కూడా చేసి తీరాలని ఎంత బెదిరించినా తన వల్ల కాదు మొర్రో అనేసరికి అదే కత్తితో ఏకంగా పన్నెండు చోట్ల పొడిచింది. దీంతో లుమినిటా పెరిజోక్ (30) అనే ఆ మహిళపై రొమేనియన్ టాక్సీ డ్రైవర్ నికోల్ స్టాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టాక్సీ దిగిన తర్వాత బ్యాగులు ఎక్కువగా ఉన్నాయని, అపార్ట్‌మెంట్ వరకు సాయం పట్టాలని అడిగితే.. మానవతా దృక్పథంతో వెళ్లానని, లోపలికి వెళ్లాక శృంగారానికి రమ్మంటే తాను నిరాకరించగా కత్తి చూపి బెదిరించి దుస్తులు విప్పించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పెరిజోక్ మందులు తీసుకుంటుండటంతో వాటి ప్రభావం వల్ల ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు అందరూ తన గురించే మాట్లాడుకుంటూ చూసి నవ్వుకుంటున్నారని.. కానీ కత్తి చూపించి బెదిరిస్తే మిస్ రొమేనియా వచ్చినా శృంగారం చేయడం అసాధ్యమని స్టాన్ అంటున్నాడు. ఎలాగోలా బెడ్‌రూంలోకి దూరి 999కు ఫోన్ చేసి పోలీసుల సాయంతో బయటపడినట్లు చెప్పాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లామని, పన్నెండు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications