చర్లపల్లి జైళ్లో మళ్లీ భానుకిరణ్ హంగామా, వాగ్వాదం?

కాగా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ బుధవారం కూడా చర్లపల్లి జైలులో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. జైలులో వసతులు సరిగా లేవని జైలు సూపరింటెండెంట్‌తో వాగ్వాదానికి దిగాడు. సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భాను కిరణ్ ఒక్కసారిగా హల్ చల్ సృష్టించడంతో జైలు సిబ్బంది అయోమయానికి గురయింది. భాను కిరణ్ గతంలోనూ జైలులో హంగామా సృష్టించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పోలీసులు ఏప్రిల్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో మే 4వ తేది వరకు భాను కిరణ్‌కు కోర్టు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది. దీంతో భానును పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పొద్దునే ఆరుగంటలకే తనకు అన్ని పత్రికలు కావాలని జైలు సిబ్బందితో అతను వాదానికి దిగాయని అప్పుడు వార్తలు వచ్చాయి. దీంతో జైలు సిబ్బంది కొన్ని పత్రికలను సమకూర్చారు. భానును చూసేందుకు ఇతర బ్యారెక్స్‌లో ఉండే నేరగాళ్లు ఎగబడ్డారు.
సూరి చాలాకాలం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం విదితమే. సూరితో కలిసి ఉన్న ఖైదీలు ఇప్పుడు భాను చుట్టూ చేరి ఆసక్తిగా మాట్లాడుకోవడం కనిపించిందని జైలు వర్గాలు అప్పుడు తెలిపాయి. ప్రస్తుతం చర్లపల్లి మానస విభాగంలో ఉన్న భానును ముందు చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లాలని పోలీసులు గతంలో భావించారు. కానీ ఇటీవలి కాలంలో చంచల్‌గూడ జైలులో విఐపి విచారణ ఖైదీల సంఖ్య పెరిగింది. పైగా రెండు ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని చంచల్‌గూడ జైలుకు భానును తరలించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications