కిరణ్ కుమార్‌కు కేంద్రం ఝలక్: ఉమేష్ సస్పెన్షన్‌కు నో

గతంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పుడు దానిని కేంద్రం ఆమోదించింది. కానీ, ఉమేశ్ సస్పెన్షన్‌పై అందుకు భిన్నంగా స్పందించి ఫైలును గురువారం రాష్ట్రానికి తిప్పిపంపింది. డీజీపీ దినేశ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక ఎంపీ పేరిట కేంద్రానికి ఫోర్జరీ లేఖ వెళ్లడంలో ఉమేశ్ పాత్ర ఉందని సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే! ఆ కేసు విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో నాంపల్లి కో ర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది
తర్వాత ఆయన కోర్టుకు వచ్చి కారణాలు వెల్లడించడంతో వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో విధులకు గైర్హాజరయ్యారని, సర్వీసు రూల్స్‌ను అతిక్రమించారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉమేశ్‌ను సస్పెండ్ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూపిన కారణాలు సహేతుకంగా లేవని, ఇంత చిన్న కారణంతో సస్పెండ్ చేయడం సమంజసం కాదని పేర్కొంటూ ఉమేశ్ సస్పెన్షన్‌ను కేంద్రం తిరస్కరించింది. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేసి, తిరిగి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications