పిజెఆర్ తనయ అరెస్ట్: వంగవీటి రాధాకృష్ణ హౌస్ అరెస్ట్

ఆమెను పోలీసులు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మేడ్చల్‌లో సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి, ఎల్బీ నగర్‌లో పుత్తా రెడ్డిలతో పాటు ఆయా జిల్లాలల్లో ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొన్నారు. పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎమ్మెల్సీ తిప్పారెడ్డిలు అరెస్టయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
నిజాబామాద్ బస్టాండ్ డిపో వద్ద పార్టీ నేత బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి సహా పలువురు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేయడంతో బాజిరెడ్డి పోలీసు స్టేషన్‌లోనే తన నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూను అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో వంగవీటి రాధాకృష్ణను, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.
శాంతియుతంగా తాము ఆందోళన, ర్యాలీలు చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటూ అక్రమ అరెస్టులు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అరెస్టు చేసిన తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై కాంగ్రెసు తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications