ఈ రాత్రికే బ్లూ మూన్: డోంట్ మిస్, తప్పక చూడండి

ఏడాదిలో 12 పూర్ణిమలకు బదులు 13 పూర్ణిమలు వచ్చినప్పుడు బ్లూ మూన్ ఆకాశం మీద పొడుస్తుంది. అయితే, బ్లూ మూన్ మిగతా రోజుల్లోని చంద్రుడి కన్నా ఎక్కువ నీలంగా ఉంటుందా అని ప్రశ్నిస్తే కాదని చెబుతున్నారు. అది స్వచ్ఛతకు సంబంధించింది మాత్రమే.
మిగతా రోజుల్లో కన్నా కాస్తా స్వచ్ఛంగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ పేరు తొలిసారి రైతు పంచాంగంలోని కనిపిస్తుంది. రైతు పంచాంగం ఏడాదికి 12 పూర్ణచంద్రులను లెక్కిస్తుంది. ఓ ఏడాదిలో 12కు బదులు ఒకటి ఎక్కువగా పూర్ణ చంద్రుడు రావడాన్ని రైతు గమనించాడు.
ఏడాదిలో అదనంగా వచ్చిన పూర్ణ చంద్రుడిని పంచాంగకర్త బ్లూ మూన్ అని పిలిచాడు. తర్వాతి బ్లూ మూన్ 2015లో వస్తుంది. అప్పటి దాకా వేచి చూడకుండా ఈ రోజే చందమామ రావె, జాబిలి రావె అని పాడుకోవడానికి అవసరమైన అందాన్ని సంతరించుకునే చంద్రుడిని చూసి మురిసిపోండి.












Click it and Unblock the Notifications