న్యూజెర్సీలో కాల్పులు, గన్‌మన్ సహా ముగ్గురు మృతి

పోలీసుల కాల్పుల్లో సాయుధ దుండగుడు హతమయ్యాడు. ఉద్యోగులు పనిచేస్తుండగా సాయుధుడా పథక్‌మార్క్ షాపింగ్ సెంటర్‌లో కాల్పులకు దిగినట్లు సమాచారం. సాయుధుడు రక్షణ కవచం ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే భద్రతా బలగాలు షాపింగ్ సెంటర్‌ను చుట్టుముట్టారు.
అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇటువంటి సంఘటనల్లో ఇది నాలుగవది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వద్ద వారం రోజుల క్రితమే ఇటువంటి సంఘటన జరిగింది. ఆగస్టు 5వ తేదీన మైఖెల్ వాడే పేజ్ విస్కాన్సిన్‌లో గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా సంఘటనతో అమెరికాలోని గన్ చట్టాలపై చర్చ ప్రారంభమైంది. గన్ చట్టాల గురించి మాట్లాడకపోవడంపై గురుద్వారా కాల్పుల తర్వాత న్యూయార్క్ మేయర్ మైఖెల్ బ్లూమ్‌బెర్గ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ అధ్యక్ష నామినీ మిట్ రోమ్నీపై విమర్శలు గుప్పించారు. ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లో ఆయుధాలు పెడుతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications