టైందాటిందని లేడీ సింగర్ పెళ్లి వేడుకలకు పోలీసుల చెక్

Police raid Pakistani pop singer Annie Khalid's wedding
లాహోర్: ప్రముఖ పాకిస్తాన్ గాయని అన్నీ ఖలీద్ పెళ్లి వేడుకలపై పాకిస్తాన్ పోలీసులు దాడి చేసినంత పని చేశారు. తమ పెళ్లి వేడుకలపై పోలీసులు దాడి చేసినంత పని చేయడంతో సదరు గాయని ఖలీద్ స్పృహ కోల్పోయారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయని అన్నీ ఖలీద్ దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్న పాకిస్తాన్ యువకుడు మాలిక్ నవీద్ అవాన్‌ను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు చేసింది.

పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. ఆ సంతోషకరమైన రోజు ఈ నెల 1న రానే వచ్చింది. గాయని పెళ్లి వేడుక చూడాలని ఎంతో మంది అభిమానులు, బంధువులు, సన్నిహితులు లాహోర్ నగరానికి ఉత్సాహంగా తరలి వచ్చారు. సరిగ్గా రాత్రి 10.30కి పోలీసులు కూడా వచ్చారు. గాయని అన్నీ ఖలిద్ వెంటనే షాక్‌కు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివాహ వేడుకలను రాత్రి 10 గంటలకు ముగించాలి. ఆ తర్వాత కూడా కొనసాగిస్తే అది నేరంగా పరిగణిస్తారు. గాయని ఖలిద్ కల్యాణం ముగిసినా.. సంబరాలకు మాత్రం తెరపడలేదు. రాత్రి పది దాటినా కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఖాలిద్ అభిమానులు, సన్నిహితులు వారితో వాదనకు దిగారు. దాడి చేసినంత పనిచేశారు. ఆనందకరమైన రోజున ఇలా జరిగేసరికి ఖలిద్ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తమ జీవితంలో ముఖ్యమైన రోజును పోలీసులు ఇలా పాడు చేశారని, తన భార్య అవమాన భారాన్ని తట్టుకోలేకపోయిందని ఖలిద్ భర్త మాలిక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇధ్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+