ఆ లేడీ కిలాడీ గర్భవతి, తండ్రెవరు?: బెయిల్ పిటిషన్

Shahanaz
చెన్నై: నిత్య పెళ్లికూతురు హెషనాజ్ ఆరు నెలల గర్భవతిగా తేలింది. ఆమెకు ఆదివారంనాడు సాయంత్రం ట్రిప్లికేన్‌లోని కస్తూర్బా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ విషయం తేలింది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరనే విషయాన్ని నిర్ధారించడానికి డిఎన్ఎ పరీక్షలు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

కాగా, తాను 50 మందిని పెళ్లాడినట్లు మీడియాలో వచ్చిన వార్తలను షెహనాజ్ ఖండించింది. తాను మొత్తం ఎనిమిది మందితో కలిసి మెలసి తిరిగానని, వారిలో నలుగురిని మాత్రమే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. కేరళకు చెందిన సిద్ధిక్ తన మొదటి భర్త అని ఆమె తేల్చింది. తన కడుపులో పెరుగుతున్న శిశువుకు ఫుట్‌బాల్ క్రీడాకారుడు ప్రసన్ననే తండ్రి అని ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

ఈ విషయంపై పోలీసులు ప్రసన్నను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే తాను ఆ బిడ్డకు తండ్రిని కాదని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో షెహనాజ్ భర్తకు, సహచరులకు డిఎన్ఎ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

ఇదిలా వుంటే, షెహనాజ్ బెయిల్ కోరుతూ చెన్నై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంది. గర్భవతిని అయిన తనకు మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. ముప్పై ఏళ్ల ఆ మహిళను చెన్నై పోలీసులు సెప్టెంబర్ 1వ రాత్రి బెంగళూర్‌లోని మెజిస్టిక్ ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ఊన్నట్లు సమాచారం అందుకుని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+