యశోదా ఆస్పత్రి వైద్యుడి కిడ్నాప్: డబ్బులు డిమాండ్

పోలీసుల కథనం ప్రకారం - మలక్‌పేట నివాసి డాక్టర్ హర్షారెడ్డి (31) మలక్‌పేట య శోదా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. రోజూ మాదిరిగానే హ ర్షారెడ్డి సోమవారం సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి వెళ్లి మంగళవారం ఆస్పత్రికి రాకపోవడంతో అతని స్నేహితుడు హేమంత్ చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాక్టర్ హర్షారెడ్డి తప్పిపోయినట్లుగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
హర్షారెడ్డి తల్లిదండ్రులు విజయవాడలో ఉంటున్నా రు. కాగా మంగళవారం ఉదయం హ ర్షారెడ్డి మొబైల్ నుంచి అతని తండ్రి లక్ష్మారెడ్డి ఇంటి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చే సి రూ. 40లక్షలు ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మారెడ్డి ముందుగా తన కు మారుడు ఎక్కడ ఉన్నాడంటూ అతని స్నేహితుడైన హేమంత్‌ను వాకబు చేయగా కనిపించడంలేదంటూ చెప్పి చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని వివరించారు.
దీంతో తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫో న్‌చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేసిన విషయాన్ని లక్ష్మారెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మంగళవారం సాయంత్రం చేరుకొని చాదర్‌ఘాట్ పోలీసులకు వివరించారు. దాంతో పోలీసులు డాక్టర్ హర్షారెడ్డి మిస్సింగ్ కేసును కిడ్నాప్‌గా పరిగణిస్తూ కేసును ఆకోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
మణిపాల్ మెడికల్ కాలేజీలో పిజి స్టూడెంట్ హేమ ప్రసన్నను హర్షా రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. కొంత మంది సహోద్యోగులతో కలిసి అతను యశోదా ఆస్పత్రి వెనక ఓ అపార్టమెంటులో ఉంటున్నాడు. సోమవారం హర్ష నివాసానికి రాలేదు, ఫోన్ చేస్తే కలవడం లేదు. ఆస్పత్రి సిసిటివీ కెమెరాలను మిత్రుడు హేమంత్ తనిఖీ చేశాడు. సాయంత్రం ఐదున్నరకే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినట్లు నిర్ధారించుకున్నాడు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications