అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

తెలిసిన వివరాల ప్రకారం - అతను కొండాపూర్ శిల్పా పార్క్ చాముండేశ్వరి హైట్స్ అపార్టుమెంటులో నివాసం ఉంటున్నాడు. అదే కంపెనీకి చెందిన అరునవ్ రాయ్, ప్రసార్ జైన్‌లతో అతను కలిసి ఉంటున్నాడు. సోమవారం ఉదయం మిగతా ఇద్దరు రోజు మాదిరిగానే విధులకు వెళ్లారు. అనిరుధ్ మాత్రం తన గదిలో ఉండిపోయాడు.
రాత్రి పది గంటల ప్రాంతంలో కార్యాలయం నుంచి స్నేహితులు తిరిగి వచ్చేసరికి లోపల గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా తలుపు తెరుచుకోలేదు. దీంతో వాళ్లు తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. చూస్తే అనిరుధ్ చడీచప్పుడు లేకుండా పడి ఉన్నాడు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంది. గొంతుకు బెల్టు చుట్టి ఉంది. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనిరుధ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మానసిక పరిస్థితి బాగా లేదని, దాంతోనే అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications