నాకు సెక్సువల్ వేధింపులు: సునీల్‌పై తస్లిమా నస్రీన్

తన నవల ద్విఖండితో నిషేధంతోపాటు బెంగాల్ నుంచి తన బహిష్కరణలోనూ సునీల్ కీలక పాత్ర పోషించారని, తననే కాదు, చాలామంది మహిళలను లైంగికంగా వేధించారని, ఆయన సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా ఉండటం సిగ్గు.. సిగ్గు అని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించేందుకు గంగోపాధ్యాయ తిరస్కరించారు. తాను చేయాల్సిన పని చాలా మిగిలి ఉందని, ఇలాంటి వాటిపై మాట్లాడే సమయం తనకు లేదని ఆయన అన్నారు.
ఢిల్లీలో గుర్తు తెలియని ప్రదేశంలో అజ్ఞాతంలో ఉన్న తస్లీమా హఠాత్తుగా విరుచుకు పడేందుకు ఓ కారణం ఉంది. బెంగాల్‌లో సీనియర్ పోలీసు అధికారి నజ్రుల్ ఇస్లాం రాసిన ఓ పుస్తకంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధానాలపై పరోక్ష విమర్శలు చేశారు. దీంతో దాన్ని ప్రచురించిన సంస్థ కార్యాలయంపై నిఘా విభాగం పోలీసులు సోమవారం దాడులు చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. దీన్ని ఖండిస్తూ పుస్తక నిషేధానికి తాను వ్యతిరేకినని సునీల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై మండిపడ్డ తస్లీమా, ఆయన కపటస్వభావి అని ఆరోపించారు. తన రచన నిషేధం, తన బహిష్కరణలకు అసలు కారకుడు ఆయనేనన్న నిజాన్ని వెల్లడిస్తున్నానంటూ ట్విట్టర్‌లో తాజా ఆరోపణలు గుప్పించారు.












Click it and Unblock the Notifications