లోకేష్ ప్రధాన కార్యదర్శి, బాలకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్?

Balakrishna - Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా హీరో నందమూరి బాలకృష్ణను నియమిస్తారనే ప్రచారం ఇటీవల జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పదవిని బాలకృష్ణకు కాకుండా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కుమార్‌కు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. లోకేష్‌కు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించి బాలకృష్ణకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.

ఇటీవల బాలకృష్ణ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పదవిపై జోరుగా ఊహాగానాలు చెలరేగాయి. పార్టీ అధినేత చంద్రబాబుతో సమాన ప్రాధాన్యత ఉండేందుకు ప్రధాన కార్యదర్శి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి పదవిని బాలయ్యకు దాదాపు ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే యువతను ఆకర్షించేందుకు లోకేష్‌ను కూడా పార్టీలోకి తీసుకొని ప్రధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని పలువురు నేతలు బాబుపై ఒత్తిడి తెస్తున్నారు.

ఈ నేపథ్యంలో లోకేష్‌కు ప్రధాన కార్యదర్సి పదవి ఇచ్చి బాలయ్యకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బావుంటుందనే అభిప్రాయానికి టిడిపి వర్గాలు వచ్చాయంటున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అక్టోబర్ 2 నుండి పాదయాత్ర చేపట్టనున్నారు. దీనిని సమన్వయపర్చే బాధ్యత లోకేష్‌కు అప్పగించారని తెలుస్తోంది. అందులో భాగంగా లోకేష్ టిడిపి కార్యాలయం నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. కార్యాలయ నిర్వహణ బాధ్యతను కూడా ఆయన నిర్వహించనున్నారని సమాచారం.

లోకేష్‌ను సాధారణ కార్యకర్తగా కార్యాలయంలో కూర్చోబెట్టడం కాకుండా ఓ పదవితో కూర్చుండబెడితే బాగుంటుందని, అది ప్రధాన కార్యదర్శి పదవి అయితే బాగుంటుందనే తమ్ముళ్ల సూచన మేరకు బాబు ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ నెల 11, 12వ తేదీల్లో జరగాల్సిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని వాయిదా వేసుకోవడం వెనుక లోకేష్‌కు ఆ పదవి కట్టబెట్టేందుకే అంటున్నారు. తర్వాత జరిగే సమావేశంలో లోకేష్‌కు బాధ్యతలు అప్పగించనున్నారని అంటున్నారు. లోకేష్ కోసం ఎన్టీఆర్ భవనంలో ప్రత్యేక చాంబర్‌ను తయారు చేస్తున్నారట. మొదటి అంతస్తులో గతంలో చంద్రబాబు ఉపయోగించిన చాంబర్‌ను ఆయన కోసం రెడీ చేస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+