మంత్రులపై విహెచ్ ధ్వజం: అవకాశవాదులని వ్యాఖ్య

పార్టీ కార్యకర్తల నుంచి సూచనలను స్వీకరించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు నివేదిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసును బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, పదవులపై తమకు ఆశ లేదని ఆయన అన్నారు. మంత్రివర్గం ఉటుంది గానీ నామినేటెడ్ పోస్టులు ఉండవా అని ఆయన అడిగారు.
ఎందుకు ఓడిపోతున్నామనే విషయంపై పార్టీపరంగా చర్చ జరగాలని తాను సూచించినా పిసిసి పట్టించుకోకపోవడంతో తానే చొరవ చూపి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఆహ్వానించారు. కానీ వారు రాలేదు. 1972 నుంచి యూత్ కాంగ్రెసు అధ్యక్షులుగా పనిచేసినవారిని ఈ సదస్సుకు విహెచ్ ఆహ్వానించారు.
తెలంగాణ అంశాన్ని తేల్చకపోతే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోకపోతే కాంగ్రెసుకు గడ్డుకాలమేనని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలతో యుపిఎ ఇబ్బందుల్లో ఉందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు గెలవడం కష్టమేనని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో, సీమాంధ్రలో జగన్ ప్రభంజనంతో కుదేలైన కాంగ్రెసును మళ్లీ గాడిలో పెట్టేందుకు యువ కాంగ్రెసు నేతలు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.












Click it and Unblock the Notifications