కొడాలి నానిపై రావి పోటీ: బాలకృష్ణ హామీతో టిడిపిలోకి!

అప్పుడే కొత్తగా మెగాస్టార్ చిరంజీవి పార్టీ స్థాపించడంతో రావి టిడిపిని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అయితే తాజాగా కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుడివాడలో మంచి పట్టున్న రావి తిరిగి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రావి చేరిక వెనుక బాలకృష్ణ ప్రయత్నాలు ఉన్నాయని సమాచారం.
అందుకే హీరో నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తంలోనే రావి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం రావి తన అనుచరులతో పార్టీలో చేరనున్నారు. రావి వెంకటేశ్వర రావు తండ్రి రావి శోభనాద్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. దీంతో అక్కడ వారికి మంచి పట్టు ఉంది. దీంతో రావి గుడివాడ ఎమ్మెల్యేగా 2004 వరకు కొనసాగారు.
అయితే ఆ తర్వాత గుడివాడ టిక్కెట్ కొడాలి నానికి ఇవ్వడంతో ఆయన 2009కి ముందు పిఆర్పీలో చేరారు. ఇప్పుడు రావి తిరిగి పార్టీలో చేరడంతో రానున్న ఎన్నికల్లో గుడివాడ నుండి కొడాలి నాని పైన రావి పోటీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కొడాలి నాని జగన్‌కు జై కొట్టడంతో ఉప ఎన్నికల్లోగానీ, 2014 ఎన్నికల్లో గానీ గుడివాడ నుండి టిడిపి తరఫున పోటీ చేసే అభ్యర్థి గురించి జోరుగా చర్చ జరిగింది. ఓ సమయంలో బాలకృష్ణనే స్వయంగా పోటీ చేస్తారనే వాదనలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య ఆశీర్వాదంతో పార్టీలోకి వచ్చిన రావియే నానిపై పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications