వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ 3సెల్‌ఫోన్స్ వాడుతూ, 25కోట్లతో సౌకర్యాలు: వర్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Varla Ramaiah
విజయవాడ/హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైళ్లో మూడు సెల్ ఫోన్లు వాడుతూ... అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య శనివారం ఆరోపించారు. జైలు సూపరింటెండెంట్‌ను బదలీ చేసి.. అంతా ప్రక్షాళన చేసినట్లుగా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి, వైయస్ జగన్‌లకు చంచల్‌గూడ జైలులో రూ.25 కోట్లతో ఫైవ్‌స్టార్ సౌకర్యాలు కల్పించారని వర్ల ఆరోపించారు. ఈ జైలు స్కాంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్, గాలి జనార్దన్ రెడ్డికి రాజ ప్రసాదాలను తలపించే సౌకర్యాలను కల్పించారని ఆరోపించారు. దీనిపై ఎసిబి విచారణ నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నేతృత్వంలో జైళ్ళు స్టార్ హోటళ్ళుగా మారిపోయాయని, రాష్ట్రం అంధకారంలో మునిగిపోయిందని విమర్శించారు.

మరోవైపు...కాంగ్రెసు పార్టీని రోడ్డు మీద పడేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి వేరుగా హైదరాబాదులో అన్నారు. అనుభవం లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి అయ్యో ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. విద్యుత్తు కోతలకు నిరసనగా తెలుగు మహిళ విభాగం ఆధ్వర్యంలో లుంబినీ పార్కు నుంచి ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు లాంతర్ల ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా ఉన్న రాష్ట్రం ప్రస్తుతం అవినీతికి, అంధకారానికి, అత్యాచారాలకు చిరునామగా మారిపోయిందని విమర్శించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో బిసి విద్యార్థులు నెత్తురు అమ్ముకొని చదువుకున్నారని, అలాంటి వైయస్ వారసులుగా వచ్చిన వైయస్ జగన్, వైయస్ విజయమ్మలను బిసి విద్యార్థులు ఎన్నటికీ నమ్మరన్నారు.

English summary
YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan 
 
 Reddy is using three cell phones in Chanchalguda jail, 
 
 accused TDP leader Varla Ramaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X