విభేదాల్లేవు, ఢిల్లీలో కెసిఆర్.. గల్లీలో ప్రజలు: కోదండరాం

Kodandaram
మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం అన్నారు. ఢిల్లీలో కెసిఆర్, గల్లీలో ప్రజలు పోరాటాలతో తెలంగాణ కోసం ఒత్తిడి తీసుకు వస్తున్నారని, చివరకి అందరి లక్ష్యం తెలంగాణ సాధనేనని ఆయన అన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈనెల 30న నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ మార్చ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్‌తో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. గుప్పెడు మందిగా ఉన్న ఆంధ్రా పెట్టుబడిదారులే తెలంగాణనువ్యతిరేకిస్తున్నారని, వారి ఒత్తిడికి ప్రభుత్వం తలవంచడం శోచనీయమని చెప్పారు.

హైదరాబాద్ మార్చ్ ద్వారా తెలంగాణ కోసం మరో పోరాటానికి తెరలేవనుందన్నారు. కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ఉద్యమం త్వరలోనే ఉదృతమవుతుందన్నారు. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతం చేసేందుకు ఊరూరా జెఏసిలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమంపై తయారు చేసిన చర్చ పాటల సిడిని ఆవిష్కరించారు.

కాగా ఇటీవల కోదండరామ్, కెసిఆర్ మధ్య విభేదాలు పొడసూపాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పాలమూరు ఉప ఎన్నికలలో స్థానిక జెఏసి బిజెపికి సహకరించడాన్ని ఆపని కోదండరామ్ పైన అప్పట్లో కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, అప్పటి నుండి క్రమంగా వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని, ఓ సమయంలో కోదండరామ్‌ను జెఏసి చైర్మన్‌గా తీసేసి మరొకరిని పెడదామని కూడా కెసిఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలొచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+