ఆయనో చీడపురుగు: పుల్లా, అందరికీ తెల్సు.. శంకరన్న

P Shankar Rao-Pulla Padmavathi
హైదరాబాద్: శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి సోమవారం మాజీ మంత్రి శంకర రావుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. పద్మావతి తనపై రుసరుసలాడటంతో శంకర రావు కూడా వేరుగా అంతే ధీటుగా స్పందించారు. పద్మావతి మీడియాతో మాట్లాడుతూ.. శంకర రావు పార్టీలో ఓ చీడ పురుగు అని, ఆయనను పార్టీ నుండి బయటకు పంపాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆయన తీవ్ర మానసిక సమస్యతో బాధపడుతున్నారని, అందుకే సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన వైఖరి చూస్తుంటే ముడుపులు తీసుకొని మాట్లాడుతున్నారేమో అనే అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. ఆమె తనపై విమర్శలు గుప్పించడంతో శంకర రావు వేరుగా స్పందించారు.

పుల్లా పద్మావతి కాంగ్రెసు పార్టీ కోసం చేసిన త్యాగాలు అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఆమె పార్టీ కోసం చేసిన సేవలు ఆ ఊరి వారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుందన్నారు. పెట్రోలు బంకుల కోసమే ఆమె తనపై విమర్శలు చేస్తోందని అన్నారు. రహేజా భూకేటాయింపులపై విచారణ జరిపించాలని శంకర రావు డిమాండ్ చేశారు.

కాగా శంకర రావు కాంగ్రెసు పార్టీలో ఉంటూనే సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సమయం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులపై విరుచుకు పడుతున్నారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు పుల్లా పద్మావతి తొలుత కొద్ది రోజులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉండి ఆ తర్వాత తిరిగి కాంగ్రెసు గూటికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+