విజయమ్మకు చిరు సీటు, అసెంబ్లీకి ధర్మాన డుమ్మా

YS Vijayamma - Dharamana Prasad Rao
హైదరాబాద్: శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ పక్ష నేత వైయస్ విజయమ్మకు గతంలో చిరంజీవికి కేటాయించిన సీటు కేటాయించే అవకాశం ఉంది. ప్రజారాజ్యం శాసనసభా పక్ష నేతగా చిరంజీవి శాసనసభ ముందు వరుసలో కూర్చునేవారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైంది. దీంతో గత ప్రజారాజ్యం శాసనసభ్యులంతా అధికార కాంగ్రెసు సభ్యుల వరుసల్లోకి వెళ్తారు. దాంతో చిరంజీవి గతంలో కూర్చున్న సీటును విజయమ్మకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యులున్నారు. గతంలో వైయస్ విజయమ్మ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రమే ఉండేవారు. ఉప ఎన్నికల్లో 15 మంది విజయం సాధించడంతో ఆ సంఖ్య 17కు పెరిగింది. దాంతో విజయమ్మ ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ముందు వరుసలోకి రానున్నారు.

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు శాసనసభా సమావేశాలకు గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి. హాజరై ఆభాసుపాలు కావడం కన్నా గైర్హాజరు కావడమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రభుత్వంపై అలక వహించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చింది. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ధర్మాన ప్రసాదరావు రాజీనామా ఇంకా పెండింగులోనే ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని తిరస్కరించలేదు. ధర్మాన ప్రసాదరావు దాన్ని వెనక్కి తీసుకోలేదు. దీంతో శాసనసభకు హాజరైతే ఎక్కుడ కూర్చోవాలనే సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇది కూడా ధర్మాన శాసనసభకు హాజరు కాకూడదని నిర్ణయించుకోవడానికి ఓ కారణమని అంటున్నారు. శాసనసభ వర్షాకాలం సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+