హరికృష్ణ ఆరోగ్యంపై పుకార్లు: నారా లోకేష్ ఎంట్రీ

Nandamuri Harikrishna - Nara Lokesh
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఆరోగ్యం బాగా లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చెప్పా పెట్టకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశాడు. మీడియా ప్రతినిధుల వద్ద ఆరితేరిన నాయకుడిలా మాట్లాడారు. హరికృష్ణ తన ఆరోగ్యం బాగాలేదని జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు.

తన ఆరోగ్యం బాగా లేదని జరుగుతున్న ప్రచారాన్ని హరికృష్ణ ఖండించారు. కావానలే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారం వెనక కొందరు నాయకుల కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. నారా లోకేష్ రాజకీయ ప్రవేశం చేసిన సమయంలో హరికృష్ణ చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ ఆరోగ్యంపై పుకార్లు పుట్టాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

లోకేష్‌ను పార్టీ ప్రధాన కార్యదర్సిగా, బాలకృష్ణను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారనే ఊహాగానాలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. లోకేష్‌కు ప్రస్తుతానికి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించి భవిష్యత్తు నేతగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. సొంత అల్లుడు కాబట్టి బాలయ్యకు కూడా పెద్దగా అభ్యంతరాలు ఏమీ ఉండవు. లోకేష్ వ్యాపారాలు చూసుకుంటున్నారని, రాజకీయాలు ఇప్పుడే కాదని చంద్రబాబు చెప్పినప్పటికీ అతని ఆదేశాలు లేకుండా లోకేష్ బహిరంగంగా రాజకీయాలు మాట్లాడే అవకాశాలు లేవు.

బుధావరం లోకేష్ చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు వ్యూహం ఉందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు వెనక్కి వెళ్లడంతో చంద్రబాబు తన తనయుడు లోకేష్‌ను క్రమంగా తెర పైకి తీసుకు వచ్చారని అంటున్నారు. బాబు తర్వాత బాధ్యతలు ఎవరికి అనే విషయమై నాలుగు నెలల క్రితం జోరుగా చర్చ జరిగింది. అయితే అప్పుడు తెలుగు తమ్ముళ్లు బాబు మరో పది పదిహేనేళ్లు పార్టీని నడిపిస్తారని, ఇప్పుడే దానిని ఆలోచించడం అనవసరమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+