హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మార్చ్: ఢిల్లీకి టి-మంత్రులు, క్లారిటీ ఉంది..కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao-K Jana Reddy
హైదరాబాద్: సెప్టెంబర్ 30వ తేదిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన తెలంగాణ మార్చ్ తెలంగాణ ప్రాంత మంత్రులలో వణుకు పుట్టిస్తోంది. తెలంగాణ మార్చ్ నేపథ్యంలో ఆ ప్రాంత మంత్రులు ఢిల్లీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య బుధవారం డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు.

తెలంగాణపై అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు మంత్రులందరూ ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నారని, మీరు కూడా రావాలని దామోదరను కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంత మంత్రులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అపాయింటుమెంట్ కోరారు. ఇంకా అనుమతి రాలేదు. అధిష్టానం నుండి అనుమతి వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, తెలంగాణ ఇస్తే వచ్చే లాభాలను ఆమెకు వివరించనున్నారని సమాచారం. జానా, సారయ్యలు మంత్రులందరినీ దీనిపై సంప్రదిస్తున్నారు.

షిండే వ్యాఖ్యలు వక్రీకరించారు.. కెకె

కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని కాంగ్రెసు పార్టీ నేత కె కేశవ రావు అన్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తారా అంటే మాత్రమే షిండే నో అని చెప్పారని కెకె అన్నారు. డిసెంబర్ 9 ప్రకటనతోనే కేంద్రానికి తెలంగాణపై స్పష్టమైన వైఖరి ఉందని తెలిసిపోయిందన్నారు.

గాంధీ దండిలా తెలంగాణ మార్చ్.. కోదండరామ్

కాగా ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకే తాము తెలంగాణ మార్చ్‌ను తలపెట్టినట్లు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ హైదరాబాదులో అన్నారు. విశాలాంధ్ర పేరుతో ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, జాతిపిత మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహంలా తెలంగాణ మార్చ్ నిర్వహిస్తామన్నారు. ప్రాంతీయ ఉద్యమాలకు ప్రత్యేకాంధ్ర ఉద్యమమే స్ఫూర్తి అన్నారు.

బాబును నమ్మరు.. కిషన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విశ్వసనీయత కోల్పోయారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ, మద్యం నిషేధాలపై బాబు మాట మార్చారన్నారు. బాబు చేయబోతున్న యాత్రలను ప్రలు నమ్మరన్నారు.

English summary
Telangana region minister are planning to go Delhi on Telangana issue. They were asked party president Sonia Gandhi's appointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X