ఏ క్షణంలోనైనా తెలంగాణ: ఎంపి ఆనంద భాస్కర్

కాంగ్రెసు పరిస్థితి అంత బాగా లేదని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలు నిరాశానిస్పృహలతో ఉన్నారని, నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. పదవులు ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తామని ఆయన అన్నారు. ఇటీవల రాజ్యసభలో బిజెపి తెలంగాణపై ప్రతిపాదించిన ప్రైవేట్ తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన గట్టిగా వాదించారు.
తెలంగాణపై ఇంకా సంప్రదింపులు అవసరం లేదని, అవన్నీ ఎప్పుడో పూర్తయ్యాయని కాంగ్రెసు మరో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాయని ఆయన చెప్పారు. ప్రకటన వెలువడడమే తరువాయి అని ఆయన అన్నారు.
సిఎల్పీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీలు కెఆర్ అమోస్, కె. యాదవ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనను తప్పుగా అన్వయించారని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు షిండే ఇచ్చిన సమాధానాల్లో తెలంగాణకు వ్యతిరేకమనే భావన ఎక్కడా లేదని ఆయన అన్నారు.
కాగా, కేంద్రం తెలంగాణ ఇస్తుందనే నమ్మకంతోనే తాము వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నామని కాంగ్రెసు లోకసభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం నల్లగొండ జిల్లాలో అన్నారు. తెలంగాణ ఇస్తుందనే సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అడ్డుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం నాయకుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications