యలమంచిలి ఎమ్మెల్యే, కుటుంబ ఆస్తులపై విచారణ

అంతకుముందు కూడా కన్న బాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని హైకోర్టు రెండు రోజుల క్రితం విచారణకు స్వీకరించింది. తాజాగా ఆదిమూర్తి విశాఖ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయడంతో అక్కడి కోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
కన్న బాబుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందు వల్ల సిఆర్‌పిసి సెక్షన్ - 156/3 క్రింద కేసు నమోదు చేసి విచారించాలని విశాఖ ఎసిబి డిఎస్పీని కోర్టు ఆదేశించింది. కన్న బాబు స్వయంగా గాక ఆయన భార్య రమాదేవి, కుమారుడు సుకుమార్ వర్మ, కుమార్తె రోజారాణీల పేరిట కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
వీరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపనున్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కిషోర్ వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 11వ తేదికి కేసు వాయిదా వేశారు. కాగా కన్న బాబు ఎనిమిదేళ్లలో వేయి కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారన్న ఆరోపణలపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications