బాబు, జగన్, కెసిఆర్ బయటకెళ్లిన వారే: తులసి రెడ్డి

Tulasi Reddy
కడప: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా తమ పార్టీ నుండి బయటకు వెళ్లిన వారేనని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర 20 సూత్రాల ఆర్థిక అమలు కమిటీ చైర్మన్ తులసి రెడ్డి మంగళవారం అన్నారు. తమ పార్టీలో ఏ పార్టీ విలీనం కావాలన్నా తమకు మద్దతు ఇవ్వాలన్నా తమ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి ఉండాలన్నారు.

అలాగైతేనే వారిని తమ పార్టీలో విలీనం చేసుకుంటామని చెప్పారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒక్కటవుతాయని చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై తులసి రెడ్డి స్పందించారు. కడప జిల్లాలోని వేంపల్లెలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, కెసిఆర్ లేదా జగన్ తమ తమ పార్టీలోన కాంగ్రెసులో విలీనం చేయాలనుకుంటే అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.

వారు ఎందుకు విలీనం చేస్తున్నారో తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరముంటుందన్నారు. కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు విలీనంపై వారే చెప్పాలన్నారు. టిఆర్ఎస్, జగన్ పార్టీలను జేబులో పెట్టుకొని కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+