కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినం: శంకరన్న ప్ర్తత్యేక దీవెనలు

తండ్రి మంచితనంలో పదిశాతం మంచి గుణాలున్నా కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరు వచ్చి ఉండేదని ఆయన అన్నారు. అభియోగాలు ఎదుర్కుంటున్న మంత్రులను సాగనంపాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై కూడా ఆరోపణలున్నాయని, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి విచక్షణకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోనులో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి గురువారం తన 53వ జన్మదినాన్ని జరుపుకున్నారు. సుపరిపాలనలో కిరణ్ కుమార్ రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ, డిజిపి దినేష్ రెడ్డితో పాటు పలువురు యువజన నేతలు క్యాంపు కార్యాలయానికి చేరుకుని ముఖ్యమంత్రికి అభినందలు తెలిపారు. వేదపండితులు కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వాదించారు.












Click it and Unblock the Notifications