హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసును నీరుగారిస్తే కాంగ్రెసు గతి అంతే: యాష్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసును నీరు గారిస్తే తమ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. సిబిఐ న్యాయవాదులను మార్చడం వల్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణపై ఢిల్లీలో ఏ విధమైన చర్చ జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత స్థితిలో తెలంగాణపై ఏ విధమైన ప్రకటన కూడా వెలువడదని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలతో మాట్లాడితే అటువంటిదమీ లేదని చెప్పారని ఆయన అన్నారు. ఐక్యంగా ఉద్యమించడం ద్వారా తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌ను కలిసికట్టుగా ఏ విధంగా నిర్వహించాలో ఆలోచించాలని ఆయన అన్నారు. ఉద్యమ నిర్మాణం జరిగితేనే కేంద్రం దిగి వస్తుందని ఆయన అన్నారు.

ప్రాణహాని ఉందని, తనకెలాంటి హాని జరిగినా దానికి ప్రభుత్వానిదే బాధ్యతని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకరరావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన కదలికలను శత్రువులు గమనిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనకు భద్రతను పటిష్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, హెచ్చార్సికి లేఖలు రాస్తానని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, వైయస్ జగన్ బెయిల్ కోసం కాంగ్రెసుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుతో అవగాహనకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా సిబిఐ తరఫున వాదించే న్యాయవాదులను మార్చారని ఆయన అన్నారు. కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విలీనం కావడానికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి పట్టినంత కాలం కూడా పట్టదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

English summary
Congress Telangana region MP Madhu Yashki said that If YSR Congress party president YS Jagan case diluted, Congress will loose further strength. He said that talks on Telangana are not taking place and there will be no statement on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X