బ్రదర్ అనిల్‌కు కువైట్‌లో చుక్కెదురు: నో పర్మిషన్

Anil Kumar
కువైట్: కువైట్‌లో మత ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు బ్రదర్ అనిల్ కుమార్‌కు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ కువైట్‌లో మత ప్రచార కార్యక్రమం నిమిత్తం ఓ పార్క్‌ను అద్దెకు తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ శనివారం జరగాల్సి ఉంది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో అమెరికాలో తీసిన సినిమాపై ఇప్పటికే ముస్లిం దేశాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో బ్రదర్ అనిల్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

కాగా కువైట్ ఎంపీలు కూడా ఇక్కడ మత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తే దాడులు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. కువైట్‌లో బహిరంగ ప్రదేశాల్లో మత ప్రచారం చేయటం చట్టవిరుద్ధమని, అందుకే అనుమతి నిరాకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అనిల్ కుమార్ క్రైస్తవ ప్రచారకుడిగా పెద్ద యెత్తున ముందుకు వచ్చినట్లు చెబుతారు. క్రైస్తవ మతప్రచారం కోసం ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తుంటారు. అనిల్ కుమార్ వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిళను వివాహం చేసుకున్నారు. ఆమె ఇటీవలి ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం సాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+