భర్తపై మాజీ ప్రపంచ సుందరి యుక్తా పోలీసు ఫిర్యాదు

ప్రపంచ సుందరి కిరీటాన్ని 1999లో సాధించిన యుక్తాముఖి.. 2008దాకా అడపాదడపా కొన్ని హిందీ సినిమాల్లో నటించింది. న్యూయార్క్‌లో ఉం టున్న ప్రముఖ వ్యాపారవేత్త ప్రిన్స్ తూలీని 2008 నవంబర్‌లో వివాహం చేసుకుంది. తన భర్త తనను తరుచూ కొడుతున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకున్నట్లు అంబోలీ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్ర విక్తార్ చెప్పారు. అంతకు మించి వివరాలు చెప్పడానికి ఆయన నిరాకరించారు.
యుక్తా ముఖిని 20 ఏళ్ల వయస్సులో లండన్‌లో జరిగిన 1999 డిసెంబర్‌లో ప్రపంచ సుందరి కిరీటం వరించింది. ఆ తర్వాత ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. తులి న్యూయార్క్‌కు చెందిన వ్యాపారవేత్త, ఫైనాన్షియల్ కన్సల్టెంట్. భారతదేశంలో ఆయన కుటుంబానికి వ్యాపార సామ్రాజ్యం ఉంది.
తులి కుటుంబం లాజిస్టిక్స్, హోటళ్లు, మాల్స్ విద్య, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వంటి రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించింది.












Click it and Unblock the Notifications