కుమారకి తంటా, జెడిఎస్ నుంచి నటి పూజా అవుట్

పూజా గాంధీ తనకు చెల్లెలు వంటిదని, కన్నడం తెలియక ఆమె ఒక సభలో మాట్లాడుతూ పెద్ద ఇల్లులాంటి జెడిఎస్‌లో నాకు కుమారస్వామి నాకు తావు ఇచ్చారని చెప్తే కొన్ని మీడియా సంస్థలు పూజాగాంధీకి కుమారస్వామి పెద్ద ఇల్లు ఇచ్చినట్లు ప్రచారం చేశాయని అంటున్నారు.
విద్యావంతులు సైతం తమకు లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పూజా గాంధీ కన్నడ బ్లాక్ బస్టర్ ముంగురు మాలే సినిమాలో నటించారు. తాను పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, జెడిఎస్ తనకు తగిన వేదిక కల్పించగలదని భావించి చేరానని అప్పట్లో పూజా గాంధీ చెప్పారు.
పూజా గాంధీ ఈ ఏడాది జనవరి 18వ తేదీన జెడిఎస్‌లో చేరారు. సంజనా గాంధీ అని కూడా ఆమెను పిలుస్తారు. తాజామహల్, బుధివంట వంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఆమె నటించారు. పలు మ్యూజికి వీడియోల్లో, లఘు చిత్రాల్లో ఆమె నటించారు. పంజాబీ కుటుంబంలో ఆమె జన్మించారు. ఆమె సోదరి రాధికా గాంధీ కూడా కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications