వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ ఉద్యమించమంటారా: వాయలార్‌ రవితో కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తూ గట్టి నిర్ణయం తీసుకోకపోతే మరోసారి తీవ్ర ఉద్యమం చేపడతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించారు. తన కుమారుడు తారక రామారావు (కేటీఆర్)తో కలిసి ఆయన శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్ రవి, సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్‌లతో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం రవి నివాసానికి వెళ్లిన వీరిద్దరూ ఆయనతో ముప్పావుగంట మంతనాలు జరిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనడానికి ఈ నెల 5న ఢిల్లీ వచ్చిన కేసీఆర్ ఈనెల 10న కాంగ్రెస్ ముఖ్యులతో ముఖాముఖి చర్చలు ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం నుంచి తనకు స్పష్టమైన సంకేతాలున్నాయని కొన్నాళ్లుగా చెబుతూ వచ్చిన ఆయన 10న రవితో మంతనాలు జరిపారు. శుక్రవారం తనయుడితో కలిసి మరోసారి వయలార్‌ను కలిశారు.

ఈ రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ మీడియాకు దూరంగా ఉన్నారు. 10న జరిగిన భేటీకి కొనసాగింపుగా జరిగిన శుక్రవారంనాటి చర్చల్లో కేసీఆర్ మరోసారి తెలంగాణ విషయమై తన వైఖరిని పునరుద్ఘాటించారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. వయలార్‌తో సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని కెటి రామారావు మీడియా ప్రతినిధులకు చెప్పారు.

తెలంగాణపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెరాస మరోసారి ఉద్యమం బాట పట్టకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అనుకూల నిర్ణయం తీసుకోక తప్పదని స్పష్టంగా చెప్పామన్నారు. 30న జరగనున్న తెలంగాణ మార్చ్ కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకొనే అధికారం తనకు లేనందున కేసీఆర్‌కు ఎటువంటి హామీ ఇవ్వలేనని రవి స్పష్టం చేశారని తెలిసింది.

కేసీఆర్ అభిప్రాయాలను సోనియా దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌తో రాజకీయ సంబంధాలను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న ప్రచారాన్ని రవి మీడియా వద్ద కొట్టిపారేశారు. చాలా దూరంలోఉన్న విషయాన్ని ఇప్పుడే ఎందుకు ప్రస్తావిస్తారని ఆయన ప్రశ్నించారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao, along with his son KT Ramarao met union minister Vayalar Ravi on Telangana issue. Vayalar Ravi said that KCR opinion will be conveyed to Congress president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X