విజయ్ కు గవర్నర్ జలక్ - ఎవరీ అర్లేకర్..!?

తమిళనాడులో విజయ్ ఘన విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు పది సీట్ల దూరంలో ఆగిపోయారు. కాంగ్రెస్ మద్దతు తో ఇప్పుడు ఆరు సీట్ల అవసరం వచ్చింది. సభలో తాను బలం నిరూపించుకుంటానని.. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి అంటూ గవర్నర్ ను విజయ్ రెండు సార్లు అభ్యర్ధించారు. గవర్నర్ ముందే మద్దతుగా అవసరం అయిన 118 ఎమ్మెల్యేల లిస్టు కోరుతున్నారు. గవర్నర్ అభ్యంతరం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. అసలె ఎవరీ అర్లేకర్.. నేపథ్యం పైన చర్చ జరుగుతోంది.

తమిళనాడులో ఇప్పుడు విజయ్ - గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గవర్నర్ గా ఈ మధ్య కాలంలో బాధ్యతలు చేపట్టిన అర్లేకర్ సొంత రాష్ట్రం గోవా. తన ప్రస్థానాన్ని 1989లో బీజేపీలో సామాన్య కార్యకర్తగా ప్రారంభించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగి, ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లారు. గోవా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు పార్టీ యంత్రాంగంపై పట్టును ఇచ్చింది. 2002లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు.

Governor Rajendra Arlekar asks Vijay to submit letters demonstrating support 118 MLAs in Assembly

అప్పుడే ఆయన స్పీకర్ గా ఎన్నికయ్యారు. 2015అక్టోబర్ లో ఆయన గోవా ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా కూడా సేవలదించారు. అసెంబ్లీ నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలను తూచా తప్పకుండా పాటించడంలో ఆయన సిద్ధహస్తుడనే పేరుంది. అదే విధంగా ఆయన హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన ఈయన, 2025 నుంచి కేరళ గవర్నర్‌గా కొనసాగుతూనే తమిళనాడు అదనపు బాధ్యతలు చేపట్టారు.

గవర్నర్ న్యాయ నిపుణుల సలహా మేరకే ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఎలాంటి రాజ్యంగ పరమైన సమస్యలు రాకుండా ఉండేందుకే ఇప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అతి పెద్ద పార్టీగా టీవీకే కే అవకాశం ఇస్తానని.. అయితే, పూర్తి మెజార్టీ వివరాలు అందించాలని గవర్నర్ స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీలో విజయ్ కు బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తమిళనాడులో గత అసెంబ్లీ గడువు ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. తనకు 15 రోజులు సమయం ఇస్తే సభలో మెజార్టీ నిరూపించుకుంటానని విజయ్ చెబుతున్నారు.

అయితే.. రాష్ట్రం లో నెలకున్న రాజకీయ పరిస్థితుల పైన పూర్తి అవగాహన ఉండటంతో.. భవిష్యత్ సమస్యలు రాకుండా ప్రమాణ స్వీకారం సమయానికే ఎలాంటి వివాదం లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గవర్నర్ ఈ విషయంలో 118 ఎమ్మెల్యేల మద్దతు పైన ఖచ్చితంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, టీవీకే శ్రేణులు మాత్రం తమకు ఎప్పుడు గవర్నర్ నుంచి ఆహ్వానం అందుతుందనే ఆశతో లోక్ భవన్ వైపు ఆశగా చూస్తున్నారు. శుక్రవారం ఈ ఎపిసోడ్ కు ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+