వాస్తులో పంచభూతాల సమతుల్యతే మీ అదృష్టం

వాస్తు శాస్త్రంలో అనేక సూత్రాలు ఉన్నప్పటికీ, అన్నింటికంటే ముఖ్యమైనది "పంచభూతాల సమతుల్యత". ప్రకృతిలోని గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం అనే ఐదు మూలకాలను మన నివాస స్థలంలో సరైన దిశల్లో ఉంచడమే వాస్తు ప్రధాన ఉద్దేశ్యం. దీనికి సంబంధించిన ముఖ్య సూత్రాలు, లాభనష్టాలు ఏమిటనేది తెలుసుకుందాం.

దిశల ప్రాధాన్యత:

ఈశాన్యం అనేది దైవ మూల. ఇక్కడ బరువులు ఉండకూడదు.
బావులు, పూజా గదులకు ఇది శ్రేష్ఠం.
నైరుతి అనేది పితృ మూల. ఇక్కడ ఇల్లు ఎత్తుగా, బరువుగా ఉండాలి.
మాస్టర్ బెడ్ రూమ్ ఇక్కడే ఉండటం మంచిది.
ఆగ్నేయం అనేది అగ్ని మూల. వంటగది ఇక్కడ ఉండాలి.
వాయువ్యం అనేది గాలి మూల. అతిథి గదులు లేదా స్టోర్ రూమ్స్‌కు అనువైనది.
ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండటం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
ఇంటి దక్షిణ, పడమర దిశలు ఎత్తుగా, తూర్పు, ఉత్తర దిశలు తక్కువ ఎత్తులో ఉండాలి.

Vastu Tips According to the principles the balance of the five elements is your good fortune

వాస్తు పాటించడం వల్ల కలిగే లాభాలు

సరైన దిశలో గాలి, వెలుతురు రావడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈశాన్యం ఖాళీగా ఉంటే ఉదయం వచ్చే సూర్యరశ్మి ఇంట్లోని బ్యాక్టీరియాను చంపేస్తుంది.
అయస్కాంత తరంగాలు దక్షిణ నుండి ఉత్తరానికి ప్రయాణిస్తాయి.
వాస్తు ప్రకారం తల దక్షిణానికి పెట్టి నిద్రించడం వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గి గాఢ నిద్ర పడుతుంది.
నైరుతి దిశలో బరువు ఉండటం వల్ల ఇంట్లో సంపద నిలకడగా ఉంటుంది.
అనవసర ఖర్చులు తగ్గుతాయని నమ్ముతారు.
సరైన వాస్తు ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గుతాయి.

వాస్తు లోపాలుంటే కలిగే నష్టాలు

వాస్తు లోపాలు ఉంటే ఇంట్లో ఎప్పుడూ తెలియని ఆందోళన, చికాకులు కలిగే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ఈశాన్యంలో టాయిలెట్లు ఉండటం లేదా నైరుతి పల్లంగా ఉండటం వల్ల
ధన నష్టం, అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు చెబుతారు.
అగ్ని మూలలో నీరు ఉండటం లేదా ఈశాన్యంలో వంటగది ఉండటం వల్ల
అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+