హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విడిపోయారు: తెలంగాణపై సిఎం, కోదండపై ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం సాధ్యం కాదని, ప్రాంతాల వారీగా ప్రజాప్రతినిధులు విడిపోయారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. కిరణ్ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా వ్యవహారం, తెలంగాణ అంశం, తీర్మానం, కోదండరామ్ వ్యాఖ్యలు తదితర అంశాలపై స్పందించారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం సాధ్యం కాదని తాను తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు చెప్పానని, ఒకవేళ తీర్మానం పెట్టినా అది వీగిపోతుందన్నారు.

ప్రాంతాల వారిగా ప్రజాప్రతినిధులు విడిపోవడమే అందుకు కారణమన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ రోజున విమోచన దినాన్ని కూడా అధికారికంగా ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. తెలంగాణ అనేది సున్నితమైన అంశమని, దానిపై నిర్ణయం తీసుకోవడానికి అన్ని రకాలుగా ఆలోచించాల్సి ఉంటుందన్నారు. జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో తెలంగాణవాదులు తెలంగాణ మార్చ్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు.

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వ్యాఖ్యలపై కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరిధి దాటి ఎవరు వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేంది లేదన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు ఎంత పెద్దవారైనా ఊరుకోమన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి మార్పు అంటూ వస్తున్నవన్నీ ఊహాగానాలే అని కొట్టి పారేశారు. పార్టీ అధిష్టానం మార్పు గురించి ఆలోచించడం లేదన్నారు. మార్పు అంశం కేవలం మహారాష్ట్రకు సంబంధించిందన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాద రావును వివరణ అడిగిన తర్వాత ఆయన రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సిబిఐ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ధర్మాన వివరణ కోరతానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.2వేల కోట్ల నిధులు ఆగిపోయాయయన్నారు. ఎన్నికల విషయంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ పరిశీలన తర్వాత ఎన్నికలపై నిర్ణయం ఉంటుందన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోందన్నారు. 264 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉందన్నారు. జల విద్యుత్ సరఫరా తగ్గిందని చెప్పారు. గ్యాస్, బొగ్గు కొరతతో విద్యుత్ సమస్య మరింత తీవ్రమైందన్నారు. తెలంగాణ అంశాన్ని వాయిదా వేయాలని తమ పార్టీ నేతలు కోరారని, రాష్ట్ర విభజన కోసం ఎక్కడా కూడా పార్టీలు విప్ జారీ చేయలేదన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said on Monday that leaders of all parties in Andhra Pradesh are divided on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X