జగన్ టిడిపి ఎంపీలను ప్లకార్డ్ అడిగినప్పుడే: తులసిరెడ్డి

ఆ రెండు పార్టీల మధ్యే నిశ్చితార్థం అయిందన్నారు. టిడిపి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభలో ఓటు వేసిందని, ఇవన్నీ చూస్తే ఎవరి మధ్య నిశ్చితార్థం అయిందో అర్థమవుతోందన్నారు. టిడిపి హయాంలో అభివృద్ధి చేసిన విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ చంద్రబాబు సొంతడబ్బా వాయిస్తున్నారని విమర్శించారు.
వాస్తవానికి కాంగ్రెస్ హయాంలోనే ట్రాన్స్‌కో, జెన్‌కోలకు అనేక జాతీయ అవార్డులు వచ్చాయని, పంపిణీ నష్టాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్యూర్‌లు గణనీయంగా తగ్గాయని ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు హయం నాటికి, నేటికి 78 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా పెరిగిందన్నారు.
కానీ.. సాగర్, శ్రీశైలం నుంచి జలవిద్యుత్తు లేకపోవడం, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులకు సరిపడా గ్యాస్ లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లోనే విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోందని ఆయన వివరించారు. చంద్రబాబు గొప్పదనం గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతగానితనం గానీ ఏమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications