తెలంగాణ: సదస్సు వద్దన్న టి-ఎంపీలు, బొత్స ససేమీరా

Botsa Satyanarayana
హైదరాబాద్: ఈ నెల 23న జరగాల్సిన కాంగ్రెసు సదస్సు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభావం కారణంగానే ఈ సదస్సు వాయిదా పడనుంది. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెసు సదస్సు నిర్వహించడాన్ని తప్పు పట్టారు. తెలంగాణ పార్టీ సదస్సును వేరుగా నిర్వహించాలని వారు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ సదస్సు వేరుగా పెట్టాలని తాము కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కు లేఖ కూడా రాస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యంగా కనిపిస్తున్న ఇలాంటి సమయంలో సదస్సు ఒకటిగా కాకుండా సీమాంధ్ర, తెలంగాణలకు వేర్వేరుగా నిర్వహించాలని సూచించారు. ఇరు ప్రాంతాలకు కలిపి సదస్సులు పెడితే ఇబ్బందులు వచ్చే అవకాశముందన్నారు. ఈ సదస్సు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎంపీలు అభిప్రాయపడ్డారు.

సదస్సు విషయమై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం గాంధీ భవనంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కలిసి చర్చించారు. వేర్వేరు సదస్సులు నిర్వహించాలని ఆయన బొత్సను కోరారు. అయితే బొత్స మాత్రం అందుకు ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. సదస్సులు వేర్వేరుగా నిర్వహించేది లేదని, అవసరమైతే రాష్ట్ర సదస్సు నిర్వహించిన తర్వాత వేర్వేరుగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని కోమటిరెడ్డితో బొత్స చెప్పారు. ఈ విషయమై ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం కూడా జరిగింది.

కాగా పార్టీ బలోపేతం కోసమంటూ కాంగ్రెసు ఈ నెల 23న రాష్ట్ర సదస్సును నిర్వహించేందుకు సిద్ధమైంది. తెలంగాణ నేతలు వేర్వేరు సదస్సులకు పట్టుబడుతున్న నేపథ్యంలో సదస్సు ఈ నెల 30వ తేదికి లేదా అక్టోబర్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+