తెలంగాణ ఇచ్చేది 14లో చెప్తా, కెసిఆర్...: వాయలార్

Vayalar Ravi
న్యూఢిల్లీ: కేంద్రం తెలంగాణ ఇస్తుందా లేదా అనేది తాను 2014లో చెప్తానని కేంద్రమంత్రి వాయలార్ రవి సోమవారం అన్నారు. వాయలార్ న్యూఢిల్లీలో మీడియాతో మట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనతో తెలంగాణ అంశంపై చర్చించారని రవి చెప్పారు.

అటు కేంద్రం, ఇటు కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై చర్చిస్తోందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తనను కలిసిన కెసిఆర్ తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డియే సిఎంగా కొనసాగుతారన్నారు.

కాగా ఈ రోజు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభం కాగానే తెరాస, బిజెపితో పాటు ఇతర తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తెలంగాణపై తీర్మానం కోసం పట్టుబట్టారు. తెరాస తెలంగాణపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. దీనిని స్పీకర్ తిరస్కరించడంతో సమావేశాలను అడ్డుకున్నారు.

తెలంగాణపై తీర్మానం పెడితేనే సభను నడవనిస్తామని హెచ్చరించారు. దీంతో స్పీకర్ సమావేశాలు ప్రారంభమైన ఐదు నిమిషాలకే తొలిసారి సభను వాయిదా వేశారు. రెండోసారి కూడా అరగంట పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభను అడ్డుకునేందుకు తెరాస ప్రయత్నించింది. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+