రూ.65లక్షలు తీసుకుంటూ దొరికిపోయిన ఐటి అధికారి

రామచంద్రపురం మండలం పసలపూడికి చెందిన వడ్డీ వ్యాపారి మేడపాటి శ్రీనివాస రెడ్డి పన్ను చెల్లింపునకు అనధికార మినహాయింపు ఇచ్చేందుకు వెంకటేశ్వర రావు పథకం వేశారు. రూ.65 లక్షలు లంచం ఇస్తే రాయితీ ఇస్తానంటూ ప్రలోభ పెట్టగా, ఆ వ్యాపారి సిబిఐ అధికారులను ఆశ్రయించాడు.
దీనిపై విశాఖపట్నం సిబిఐ డిఐజీ జి నాగేశ్వర రావు ఆదేశాల మేరకు డిఎస్పీ ఎస్‌డి మిశ్రా, సిఐలతో సహా మొత్తం 10 మంది విశాఖపట్నంలో అతడి బంధువుల ఇళ్లల్లోను, కాకినాడలోని ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్ కార్యాలయంలోను ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
మరోవైపు.. వెంకటేశ్వర రావు సూచన మేరకు ఆయన బంధువు లక్ష్మణ రావు ఇంటికి వెళ్లి రూ.65 లక్షలను శ్రీనివాస రెడ్డి అందజేశారు. అప్పటికే మాటు వేసిన సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా లక్ష్మణ రావును పట్టుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర రావు తాను డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సిబిఐ అధికారులకు తెలియజేసి.. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications