బెయిలివ్వండి: రాఘవ, బ్రహ్మానంద రెడ్డికి చుక్కెదురు

బ్రహ్మానంద రెడ్డికి బెయిల్ నిరాకరణ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడు బ్రహ్మానంద రెడ్డికి బెయిల్ ఇచ్చేందకు నాంపల్లి సిబిఐ కోర్టు సోమవారం నిరాకరించింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా బ్రహ్మానంద రెడ్డి ఇటీవల సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని స్వీకరించిన కోర్టు విచారణ అనంతరం అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
కాగా, ఆడిటింగ్ పనుల నిమిత్తం చెన్నై, తిరుపతి, బెంగుళూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇదే కేసులో నిందితుడు విజయ సాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదేశాలను ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడు బివి శ్రీనివాస రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ 21కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications