కిరణ్ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు: వైయస్ విజయమ్మ

వారి రిలే దీక్షలు సోమవారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడకు వచ్చిన విజయమ్మ మాట్లాడారు. చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రైతులకు, పరిశ్రమలకు విద్యుత్‌కోత లేకుండా ఆయన చూశారన్నారు. పరిశ్రమల్లో విద్యుత్ కోతకు కారణంగా కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ముందుచూపు లేకపోవడం వల్లే వేల పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి వైయస్ ఒక్కడేనని, ఆయన పాలనలోనే వారు సంతోషంగా ఉన్నారన్నారు. 18 రోజుల పాటు పరిశ్రమలకు కరెంట్ కోత విధిస్తే పరిశ్రమలు ఎలా నడుస్తాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వచ్చిన తరువాత వారి రుణాలను రీషెడ్యూల్ చేయిస్తానని పారిశ్రామిక సంఘాలకు హామీ ఇచ్చారు. విజయమ్మతో పాటు ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి, పార్టీ నేతలు జనక్ ప్రసాద్, ప్రకాష్ రాజ్ , మధుసూధన్ రెడ్డి ఉన్నారు. దీక్షా శిబిరంలో పారిశ్రామిక సంఘాల జేఏసీ కన్వీనర్ ఎం.ఎం.రెడ్డి, ఫ్యాఫ్సియా అధ్యక్షుడు ఏపికే.రెడ్డి, డి.శివరాంప్రసాద్, కె.వీ.ఆర్.చౌదరితో పాటు కార్మికులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications