తెలంగాణ మార్చ్: గవర్నర్, జెఏసి మధ్య ఆసక్తిక చర్చ

అందుకు గవర్నర్ స్పందిస్తూ... తెలంగాణ మార్చ్ ఈ నెల 30నే తలపెట్టడానికి ఏదైనా ప్రత్యేక కారణముందా అని, ఆ విశిష్టత ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసిందని, ఆ ప్రకటన తేది అయిన డిసెంబర్ 9కి వంద రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని వారు చెప్పారు.
తెలంగాణ మార్చ్ వాయిదా వేసుకునే అవకాశముందా అని గవర్నర్ వారిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బయోడైవర్సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వారితో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణకు సానుకూలంగా ప్రకటన ఇప్పిస్తే తాము వాయిదా వేసుకుంటామని జెఏసి నేతలు గవర్నర్ కు చెప్పారు. గవర్నర్ తో భేటీ అనంతరం జెఏసి చైర్మన్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు.
కేంద్రం నుండి తెలంగాణపై సానుకూలం స్పందన వస్తే తాము అఖిలపక్షం గురించి ఆలోచిస్తామని చెప్పారు. రోడ్ మ్యాప్ ప్రకటిస్తే సంతృప్తి చెందుతామన్నారు. అప్పటి వరకు తెలంగాణ కోసం ఆందోళనలు కొనసాగుతాయన్నారు.












Click it and Unblock the Notifications