వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: సభలో టిడిపి దాడి, మంత్రుల భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geetha Reddy - Sabitha Indra Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నుండి నోటీసులు అందుకున్న మంత్రులు మంగళవారం మంత్రి గీతా రెడ్డి చాంబర్‌లో భేటీ అయ్యారు. మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డిలు సమావేసమయ్యారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులు, సభలో తమపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై వారు చర్చించారు. ఇతర మంత్రులపై ఛార్జీషీట్ దాఖలు చేసినట్లుగానే తమపై కూడా ఛార్జీషీట్ దాఖలు చేస్తే ఏం చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కోర్టు నోటీసులపై న్యాయవాదులతో కూడా మంత్రులు సంప్రదింపులు చేపట్టారు. ఈ కేసును వాదించనున్న న్యాయవాదితో వారు సుమారు నలభై నిమిషాలపాటు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలు కూడా జగన్ ఆస్తుల కేసులో నోటీసులు సుప్రీంకోర్టు నుండి అందుకున్నారు. మోపిదేవి ఇప్పటికే అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వాన్ పిక్ వ్యవహారంలో ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేశారు. దానిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కాగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం సుప్రీంకోర్టు నుండి నోటీసులు అందుకున్న మంత్రులను టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం సభ ప్రారంభం కాగానే.. కళంకిత మంత్రులను వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని టిడిపి నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత అశోక గజపతి రాజు మాట్లాడుతూ.. కళంకిత మంత్రులను ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఎలా స్పందించాలనే విషయంతో పాటు సుప్రీం నోటీసులపై చర్చించేందుకు మంత్రులు భేటీ అయ్యారు.

English summary
Ministers Sabitha indra Reddy, Ponnala Laxmaiah, Kanna Laxmi Narayana and Geetha reddy were met on Tuesday and talk about Supreme Court notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X